నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీలు జయరాం, గిరిరాజ్, ఏసిపి నిజామాబాద్ కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో మూడో పట్టణ పోలీస్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ సిఐ నరహరి, సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ, నార్త్ సిఐ సతీష్ కుమార్ లు రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్య సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో పెట్టుకుని మూడవ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు ఆదివారం నిర్వహించారు. మేము స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల కోసం మీతో ఉన్నామని ప్రజలలో నమ్మకం కలిగించడం, ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని మేము మీకోసం ఉన్నాము అని ప్రజలలో నమ్మకం కలిగించడమే. ఈ యొక్క కవాతు ముఖ్య ఉద్దేశమని అడిషనల్ డీసీపీ, ఏసీపీ కిరణ్ కుమార్ లు అన్నారు. ఇట్టి కవాతులో మూడో పట్టణ ఎస్సై ప్రవీణ్, ఐదో పట్టణ ఎస్సై అప్పారావు, మాక్లూర్ ఎస్సై సుధీర్ రావు, రూరల్ ఎస్సై మహేష్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.