విజయ్ హై స్కూల్ లో మాతృమూర్తుల సమావేశం

నవతెలంగాణ-ఆర్మూర్ : మండలం లోని మామిడిపల్లి విజయ్‌ హైస్కూల్‌, లో పాఠశాల విద్యార్థుల మాతృమూర్తుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. కవితాదివాకర్‌ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసినారు.  ఈ మాతృమూర్తుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌ విద్యాసంస్థల అధినేథ డా. అమృతలత మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థుల మాతృమూర్తులకు మద్య అవగాహన పెరగడానికి పిల్లల చదువు – క్రమశిక్షణ, వారి అభివృద్ధి – వికాసం పరీక్ష విధానంపై సందేశాలను తీర్చి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మరియు మాతృమూర్తుల సూచనల పట్ల స్పందించి సమయస్ఫూర్తితో  పరిష్కరించి సమావేశం సహృద్భావ వాతావరణంలో జరిపించారు. తదనంతరం మాతృమూర్తులను ఉల్లాస పరచడానికి త్రోబాల్‌, బాంబ్‌ ఇన్‌ ద సిటీ, సోలో డాన్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన మాతృమూర్తులకు పాఠశాల వార్షికోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.  ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.