నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ ప్రత్యేక సమావేశా లను 18 నుంచి 22 వరకు కొత్త పార్లమెంట్ భవనంలోనే నిర్వ హించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయని, వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలు కొత్త భవనంలోకి మార్చనున్నారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. అయితే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా కొత్త భవనంలోనే జరుగుతాయని తొలిత చెప్పినప్పటికీ, ఆ తరువాత పాత భవనంలోనే జరిపారు.