– రాష్ట్రపతి ముర్ముకు స్టాలిన్ విజ్ఞప్తి
చెన్నై : నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. తమిళనాడు పర్యటనను ముగించుకుని ఢిల్లీ వెళుతున్న రాష్ట్రపతికి విమానాశ్రయంలో ఈ మేరకు ఆయన ఒక వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌లో అర్హత సాధించాలనే తొలగించాలని కూడా ముఖ్యమంత్రి ఆ వినతిపత్రంలో కోరారు. రాష్ట్రపతికి వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు అడ్మిషన్ టూ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సెస్ బిల్లు 2021 రాష్ట్రపతి ఆమోదం కోసం సంవత్సరానికి పైగా పెండింగ్‌లో ఉందని స్టాలిన్ గుర్తు చేశారు. ‘నీట్ ఆధారంగా వైద్య కోర్సుల ప్రవేశం పేద, వెనుకబడిన విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్లస్ 2 ద్వారా ప్రవేశ ప్రక్రియను తమిళనాడు ఎంచుకుంది.