‘పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ముదిరాజ్‌ లకివ్వాలి’

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పటాన్‌చెరు శాసనసభా నియోజకవర్గం టికెట్‌ను ముదిరాజ్‌లకు కేటాయించాలనీ, లేకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరమవుతామని ఉమ్మడి మెదక్‌ జిల్లా ముదిరాజ్‌లు హెచ్చరించారు. ఈ మేరకు పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పునరాలోచించాలని కోరుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లా ముదిరాజులు బుధవారం శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌కు వినతిపత్రం సమర్పించారు.