నవతెలంగాణ ఆర్మూర్: సుభాష్ పత్రీజీ గారి జన్మదిన సంబరాలను డివిజన్ తో పాటు పలు మండలాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ జన్మదిన సంబరాలలో భాగంగా 8 వ రోజు మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రీ గురుడు అమృత్ రావు, జైడి గంగాధర్, రవి, రమేష్ మాస్టర్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు శ్రీ నల్ల గంగారెడ్డి , జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నీలిమ, ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్ పాల్గొన్నారు. ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలని సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గోవింద్ పెట్ మిట్టపల్లి గంగారెడ్డి, చింతలూరు మాజీ సర్పంచ్ సంతోష్, సతీష్ , కొత్తపల్లి రాజిరెడ్డి, కిష్టయ్య, ఇస్సపల్లి రాజు, గొల్ల మల్లయ్య, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.