నెలరోజుల్లో సింగరేణీయులకు బకాయిలు చెల్లింపు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులకు వేజ్‌బోర్డ్‌ బకాయిలు రూ.1,726 కోట్లను నెలరోజుల్లోపు చెల్లిస్తామని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ఒక్కో కార్మికుడికి సగటున రూ.4 లక్షల వరకు బకాయిల సొమ్ము లభిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన లెక్కల కోసం అన్ని విభాగాలను డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌ బలరామ్‌ సన్నద్ధం చేశారు. ఈ బకాయిలను ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న కార్మికులకు చెల్లిస్తున్నామనీ, పదవీ విరమణ చేసిన కార్మికులకు త్వరలో చెల్లిస్తా మన్నారు.