– భూపాలపల్లి డీఎస్పీ ఏ రాములు
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
గుడుంబా విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని భూపాలపల్లి డిఎస్‌పి ఏ రాములు హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ కరే ఆదే శాల మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి పెద్ద కుంటపల్లిలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సుమారు 3,250 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా డీిఎస్పి రాములు మాట్లాడుతూ ఇక పైన ఇలాంటి గుడుంబా తయారీ మానుకోవాలని, లేదంటే పీడీ యాక్ట్‌లు బైండోవర్ కేసు లు నమోదు చేస్తామని హెచ్చరించారు. విక్రయదారులు ప్రత్యామ్నాయ పను లు చూసుకోవాలని, దానికోసం పోలీసు శాఖ నుండి ఎలాంటి సహాయ సహ కారాలు కావాలన్నా ఇస్తామని అన్నారు. తండా మీద పూర్తి నిఘ ఉంటది అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామనరసింహారెడ్డి, ఎస్‌ఐలు సంధ్యారాణి, మచ్చ దేవేందర్ ,శ్రీకాంత్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.