పిడి యస్ బియ్యం పట్టివేత

 నవతెలంగాణ- రామారెడ్డి
అక్రమంగా నిలువ ఉంచిన పిడి యస్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన చిదుర ప్రకాష్ ఇంట్లో అక్రమ పిడియస్ బియ్యం నిల్వ ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా, ఇంట్లో 18 ప్లాస్టిక్ బస్తాల బియ్యం అక్రమంగా నిల్వంచగా, డిటి వై కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.