కేజీబీవీలో వాటర్ సమస్యను పరిష్కరించాలి: పీడీఎస్ యూ

నవతెలంగాణ-వీణవంక
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 రోజుల నుండి వాటర్ లేక విద్యార్థులు చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని, సంబంధించిన కేజీబీవీ ఇన్ఛార్జి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని అలాగే నిర్లక్ష్యంగా వివరించిన సంబంధించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు అంగిడి దేవేందర్, ధనుష్, హరీష్, వినయ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.