– టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మనిషికి జీవితంలో మనశ్శాంతి ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భముగా ప్రజాపిత బ్రహ్మ కుమారీలు హైదరాబాద్ మింట్ కాపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి నుంచి దూరంగా ఉండే ప్రక్రియలు అవసరమనీ, అప్పుడే మనోనిబ్బరం, మనశ్శాంతి లభిస్తాయని చెప్పారు. ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ హైదరాబాద్ శాఖ ఇంచార్జి అంజలి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి వ్యక్తి తమకు తాము పరివర్తన చెందేలా తాము సహాయం చేస్తామని అన్నారు. మనిషికి శాంతిపూర్వక జీవితం అత్యవసరమని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టీ శ్రీనివాస్, జే శ్రీనివాసరెడ్డి, జీ పర్వతం, సీహెచ్ మదన్‌మోహన్‌రావు, ఎస్ స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.