పీఈసీ సమావేశం వాయిదా

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం సెప్టెంబర్‌ 2న నిర్వహించాల్సిన తెలంగాణ కాంగ్రెస్‌ ‘ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ’ (పీఈసీ) సమావేశం వాయిదా పడింది. అదే రోజు వైఎస్‌ఆర్‌ వర్ధంతితోపాటు పలు కార్యక్రమాలు ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది. తదుపరి సమావేశం ఈనెల 3న సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పూర్తి వివరాలతో పరిశీలన చేయనుంది. ఈనెల 4న టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం కానుంది. పీఈసీతో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ మురళీధరన్‌ సమావేశం కానున్నారు.