ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

– మంత్రి కేటీఆర్‌పై చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అంతకుముందు తెలంగాణ అభివృద్ధి జరగలేద న్నట్టు…బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగినట్టు మంత్రి కేటీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. బుధవారం హైద రాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ అంటూ హైదరాబాద్‌ అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసు కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరా బాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు కాం గ్రెస్‌ హయాంలోనే వచ్చాయన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, ఎంతమందికి ఇచ్చారో కేటీఆర్‌ సమా ధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో పేద ప్రజలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించు కుంటుందా? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్‌ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు హామీలతో కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి అంతా పైన పటారం లోన లొటారంగా ఉందని ఎద్దేవా చేశారు.
ధరణి లోపాలపై జవాబేది? :కోదండరెడ్డి
అవినీతి, దళారీ వ్యవస్థను తొలగించేందుకే ధరణి తెచ్చామంటూ సీఎం చెప్పడం సిగ్గుచేటని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. ధరణి లోపా లపై అడిగిన ప్రశ్నలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు 24 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు పంచితే, బీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చాక సీఎం నియోజకవర్గంలో 1500 ఎకరాల అసైన్డ్‌ భూమి చట్ట విరుద్ధంగా 600 ఎకరాలు అమూల్‌ కంపెనీకి, గంగుల కమలాకర్‌కు 50 ఎకరాలు ఇచ్చారని చెప్పారు.