– కోట్‌పల్లి ఎస్సై స్రవంతి
నవతెలంగాణ-కోట్‌పల్లి
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కోట్‌పల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై స్రవంతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అహనాదారులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాద స్థలాలు విద్యుత్ స్తంభాల వంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప అనవసరంగా బయట తిరగ వద్దు అని తెలియజేశారు. మండలంలో కంకణాలపల్లి, లింగంపల్లి, మోత్కుపల్లి జిన్నారం, వాగులు కొద్దిపాటి వర్షానికి పొంగిపొర్లుతున్నాయని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా వాగులకు అడ్డంగా ట్రాక్టర్ పెట్టడం జరిగిందని కంకణాలపల్లి వద్ద నిరంతరం ఓ వ్యక్తిని కాపలా ఉంచడంతోపాటు పోలీసులు కూడా పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేశారు.