– సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
సమాజాన్ని ప్రజలను చైతన్యం చేసే వ్యక్తి క ళాకారులకే ఉందని ప్రజా కళాకారులు తమ సహ జ సజనాత్మక నైపుణ్యాలతో ఆటపాటలతో కళా నై పుణ్యంతో ప్రజలను చైతన్యం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. గురు వారం మహబూబాబాద్ ప్రజానాట్య మండలి జి ల్లా కమిటీ సమావేశం పెరుమాండ్ల జగన్నాథం భ వన్‌లో అలవాల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొ ని ప్రసంగిస్తూ దేశంలో, రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజె పిలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ డంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించా రు. టిఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందకుండా తమ పార్టీ కార్యక ర్తలకే ఇస్తున్నారని విమర్శించారు. దళిత బంధు, గృహలక్ష్మి, బిసి బంధు, డబుల్ బెడ్ రూమ్ పథకా లను అధికార పార్టీ కార్యకర్తలకు ఇస్తూ నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అర్హత కలిగిన పేదలను గ్రామసభల ద్వారా గుర్తించి లబ్ధి దారులు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ధరల నియంత్రణ చట్టాలను నీరు కార్చి కృత్రిమ కొరతను సృష్టించి పేదలపై భారాలు మోపుతున్నా రని విమర్శించారు. కలల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేసి పాలకవర్గాల దుర్నీతిని ప్రజల్లో ఎండగట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా నాట్యమండలి జిల్లా నిర్మాణ బాధ్యులు సుర్ణపు సో మయ్య, జిల్లా కన్వీనర్ నక్క సైదులు, జిల్లా కమిటీ సభ్యులు నూనె శ్రీనివాసు, కొమ్ము శ్రీనివాసు, బోర స్వామి, జంగం ఉప్పలయ్య, పర్వీన్, భాను తది తరులు పాల్గొన్నారు.