పేద ప్రజల కష్టాలు తెలిసి కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించాలి : జాజల సురేందర్

నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో నిర్మించిన బిటి రోడ్డు ,వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభోత్సవాలు నిర్వహించారు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే జాజాల సురేందర్  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే  జాజాల సురేందర్  మాట్లాడుతూ
ఈరోజు గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోష వుందని నేను 5 సంవత్సరాల నుండి ప్రజలు మధ్యనే తిరుగుతున్న ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల మధ్యనే తిరిగినమళ్ళీ గెలిపించండి మళ్ళీ మీ కోసం పని చేస్తా నా కోసం 50 రోజులు కష్టపడండి మీ కోసం 60 నెలలు కష్టపడుతామళ్ళీ నన్ను ఎమ్మెల్యే గా ఆశీర్వదించండి పేద ప్రజల కష్టాలు తెలిసి మనకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించాలి ఆయన అన్నారు  ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధబలరాం,జడ్పీటీసీ సభ్యులు శంకర్ నాయక్, ఏ ఏం సి చేర్మెన్ సత్యం రావు,పిఏసిఎస్ చేర్మెన్ సాయికుమార్,
గాంధారి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడుగాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్,ఏ ఏం సి వైస్ చేర్మెన్ రెడ్డి రాజు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు