ప్రజల బాధలను వినాలి

– మాజీ పీవీ తరహాలో బాధితులను కలవాలి : మాజీ ఎంపీ సురవరం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ సామూహికంగా ప్రజలను కలవనక్కర్లేదని(ప్రజా దర్బార్‌), ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకపోతేనే సీఎంను కలవాలని ఆయన అన్నట్లుగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇది ఆశ్చర్యకరమని మాజీ ఎంపీ, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. మన అధికార యంత్రాంగం శక్తివంతమైన దే కానీ అనేక సందర్భాలలో అది నిరంకుశమైనదనీ, చట్టం పేరుతో సమస్యలు పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడతారని విమర్శించారు. కొంతమంది ప్రజానుకూలంగా ఉంటే ప్రజాప్రతినిధులు వారిని పనిచేయకుండా నిర్బంధిస్తారని తెలిపారు. అవినీతి పరులు ప్రజలను ఇబ్బంది పెడతారని, కొన్ని ప్రభుత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉండి తీవ్రమైన అడ్డంకులు సష్టిస్తాయని, ఇవి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు పరిష్కారం చేస్తారని ప్రశ్నించారు.దేశంలో కూడా పెద్ద అధికార యంత్రాంగం, గొప్ప అధికారులు ఉన్నప్పటికీ, పీవీ. నరసింహరావు ప్రధానిగా ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రజలను కలిసేవారని గుర్తుచేశారు. వారి సమస్యలు నోట్స్‌ రాసుకుని, ప్రధాని వచ్చినపుడు వివరించేవారని, దరఖాస్తులను ప్రధాని చేతుల మీదుగా అధికారు లకు ఇచ్చేవారని తెలిపారు. వాటిని సంబధిత అధికారులకు పంపి, మళ్ళీ జవాబు పంపేవారని,వాజపేయి,మన్మోహన్‌ సింగ్‌ ఆ సంప్రదాయం కాక, ప్రజా ప్రతిని ధులను, రాష్ట్రాల ప్రతినిధి వర్గాలను కలిసేవారని వివరించారు.