
మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ 4వ వార్డు పరిధిలో 85 ఏండ్ల వయస్సు గల వృద్ధురాలైన సాహెబ్ గారి రాజు భాయికు పింఛన్ మంజూరు అయిందని మాయ మాటలు చెప్పి గుర్తు తెలియని యువకుడు బంగారం ఎత్తుకెళ్లిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 85 ఏళ్ల వృద్ధురాలైన సాహెబ్ గారి రాజు భాయికి పింఛను మంజూర అయిందని మాయ మాటలు చెప్పి ఓ గుర్తు తెలియని యువకుడు నమ్మించి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి అక్కడినుంచి పరారయ్యాడు. ఆ వృద్ధురాలైన ఆ బాధితురాలు ఇంటికి గుర్తు తెలియని యువకుడు వెళ్లి అమ్మ మీకు పింఛన్ మంజూరు అయింది మీ ఫోటో తీసుకోవాలి ఈ ఫోటోలో మీ శరీరం పైన ఉన్న బంగారం ఉంటే మీరు ఉన్నవారుగా భావించి మీకు పింఛను రాదు అని మాయమాటలు చెప్పి, ఆ వృద్ధురాలి శరీరంపై గల 1 తులం పడిగే లను,1 తులం గుండ్లను, అర తులం మేంచులను ఆమెతోనే తీయించి క్రింద ఒక పేపర్లో పెట్టించాడు. ఆమెను పింఛన్ కోసం ఫోటో తీస్తున్నట్లుగా ఫోటోలు తీసి, మాయమాటలతో నమ్మిస్తూ పేపర్ లో పెట్టిన రెండున్నర తులాల బంగారు నగలను ఆ గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లి ఆ ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఇదంతా జరుగుతుండగా ఆ వృద్ధురాలి 62 ఏళ్ల వయసు గల నడిపి కుమారుడైన మహేందర్ అదే ఇంట్లో పక్షవాతం వ్యాధితో బాధపడుతూ ఓ మంచంలో పడుకుని ఉన్నాడు. ఆ వృద్ధురాలైన తల్లికి ఇంట్లో పక్షవాతంతో బాధపడుతూ మంచంలో పడుకున్న ఆ నడిపి కుమారుడు ఇదేం నమ్మకమ్మ ఇట్లా ఏముండదు అని చెబుతున్న.. పింఛను మంజూరు మోజులో పడి ఆ వృద్ధురాలు రెండున్నర తులాల బంగారు నగలను మాయమాటలు చెబుతూ మోసగించడానికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడి చేతికి అప్పగించినట్లు అయిందని ఆ బాధితురాలు బంధువులు వాపోయారు. విషయం తెలిసి ఆ వృద్ధురాలైన మహిళ, అక్కడికి చేరుకున్న ఆమె సమీప బంధువులు లబోదిబోమని మొత్తుకొని ఏడ్చారు. ఇంట్లో వృద్ధురాలని నమ్మించి మాటల్లో పెట్టి బంగారు నగలు కాజేసిన విషయాన్ని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.