– నెలసరి విషయంలో అమ్మాయిలకు చైతన్యం కల్పించాలి
– పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్తీ దవాఖాన యందు కౌమార బాలికలలో రుతుక్రమ పరి శుభ్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనం తరం ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్లు బోడిగే స్వాతి కృష్ణ గౌడ్, బైటింటి శారదా ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూసరైన అవగాహన లేకపోవ డంతో పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతలో లో పాలు ఏర్పడతాయని, తద్వారా అనేక ప్రమాదక రమైన వ్యా ధుల బారినపడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం మ హిళలకు భద్రత అందించడంతో పాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలి పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,హాస్టల్స్ లో కూడా బాలికల కోసం ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలు తమ జీవిత కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన రుతు స్రావం(పీరియడ్స్)పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి, మేయర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… మహిళా కార్పొరేటర్ల సూచనల మేరకు నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ టాయిలెట్స్ మొదలైన ప్రదేశాలలో బాలికలు, మహిళలల కోసం శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషిన్‌తోపాటు ఇన్సినేట ర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మార్పు కోసం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను పరిశుభ్రమైన నగరంగా నిలపాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.అవసరమైతే మహిళల కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు.ఈ కార్య క్రమంలో మేడ్చల్ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, కార్పొరేటర్లు ఏంపల్ల అనంత రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బచ్చ రాజు, నాయకులు ఈశ్వర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, డాక్టర్ భార్గవి, సీనియర్ నర్స్ మోనిక, ఆశా వర్కర్స్ విజయలక్ష్మి, జ్యోతి షాహీదా, తదితరులు పాల్గొన్నారు.