జూలై 4 వరకు పీజీ పరీక్ష ఫీజు గడువు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఎం. ఏ./ఎం.ఎస్ సి./ ఎం. ఎస్. డ్లు/ ఎం. కాం/ ఎం. బి. ఎ/ఎం. సి.ఎ /ఎల్ ఎల్. బి/ ఎల్ ఎల్. ఎం /ఎపిఈ/ఐఎంఎ బిఎ/ఐపిసిహెచ్ కోర్సులకు చెందిన 2వ, 4వ, 6వ,8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 4 వరకు గడువు ఉందని,100 రూపాయల అపరాధ రుసుంతో జూలై 6 వరకు చెల్లించుకోవచ్చునని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరిన్ని వివరాలకు www.telanganauniversity.ac.in వెబ్ సైట్ సంప్రదించాలన్నారు.