– మొదటిరోజు 96.13 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 2023-24 విద్యా సంవ త్సరంలో ప్రవేశాల కోసం నిర్వ హించే పీజీఈసెట్ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో సోమవారం ప్రారంభ మయ్యాయి. వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగను న్నాయి. ఈ మేరకు పీజీఈసెట్ కన్వీనర్ బి రవీంద్రారెడ్డి సోమ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి రోజు తొలి విడతకు 6,054 మంది దరఖాస్తు చేస్తే, 5,820 (96.13 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. రెండో విడతకు 4,597 మంది దరఖాస్తు చేయగా, 4,046 (88.01 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఈ పరీక్షల ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి, పీజీ ఈసెట్ కోకన్వీనర్ జె సురేష్ కుమార్, కోఆర్డినేటర్ టి శ్రీకాంత్ పర్యవేక్షించారని తెలిపారు.