
తెలంగాణ యూనివర్సిటీ లో అర్థ శాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థులు టి.దీప్తి, జి. మహేశ్ లకు పిహెచ్. డి.డాక్టరేట్అవార్డులను ప్రదానం చేశారు. హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పరిశోధకులు టి.దీప్తి మహిళా పారిశ్రామిక వేత్తలపై ఆర్థిక సామజిక ప్రభావాలు అనే అంశంపై, జి.మహేష్ నిజామాబాద్ జిల్లాలోని సూక్ష్మ తరహా పరిశ్రమల పనితీరుపై సిద్ధాంతగ్రంధాలను రూపొందించి తెలంగాణ యూనివర్సిటీ కి సమర్పించారు. అందుకు గాను గురువారం (బహిరంగ మౌఖిక పరీక్ష) నిర్వహించగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి సీనియర్ ప్రొఫెసర్ డా. బి. సుధాకర్ రెడ్డి , ప్రొఫెసర్ జే.నర్సింహారావు ఎక్సటర్నల్ఎగ్జామినర్ గా హాజరై పరిశోధకుల గ్రంధాలపై వివిధ ప్రశ్నలు అడిగి సమగ్రమైన సమాధానాలు రాబట్టారు. ప్రొఫెసర్ ఘంటా. చంద్రశేఖర్ మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారాలకు దీప్తి సమర్పించిన సిధ్దంత గ్రంధం దీక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు ఎక్సటర్నల్ ఎక్సమినర్స్ .బి.సుధాకర్రెడ్డి, నర్సింహారావులు మాట్లాడుతూ యూనివర్సిటీ లలో నిర్దిష్ట పరిశోధనల అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారని ఈ పరిశోధన అభివృద్ధి చెందుచున్న తెలంగాణకు నమూనాగా ఉంటున్నదని ఆశాభావం వ్యక్తం చేసి పరిశోధక విద్యార్థులు టి.దీప్తి , జి. మహేష్ లను అభినందించారు. ఇక ముందు కూడా ప్రామాణిక పరిశోధనలుచేయాలని, పరిశోధకులకు సూచించారు.ఈ వైవా కార్యక్రమనికి విభాగాధిపతి డాక్టర్. ఏ పున్నయ్య అధ్యక్షతన వహించిగా పాఠ్యప్రణాళిక అధ్యక్షులు టి .సంపత్ సమన్వయం చేశారు. ఈ ఓపెన్ వైవా (బహిరంగ మౌఖిక పరీక్ష)కు డాక్టర్. పాత నాగరాజు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్. కె. రవీందర్రెడ్డి, డా. స్వప్న, రాంబాబు, స్రవంతి ,డా. శ్రీనివాస్, దత్తహరి, దేవిదాస్, తిరుపతి , ప్రసాద్ పాల్గొన్నారు.