– దుండగులపై ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలి: కెవిపిఎస్
నవతెలంగాణ- హలియా: కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దళిత నిరుద్యోగ యువతీ శిరీష (బర్రెలక్క)పై జరిగిన దాడిని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఖండించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను హాలియా లో గురువారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో వయోజనురాలైన నిరుద్యోగ దళిత యువతీ స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, అభ్యర్థి కుటుంబ సభ్యులపై భౌతిక దాడుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి దళిత యువతని పోటీలో లేకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమన్నారు నిరుద్యోగ యువతీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ ను చూసి భౌతిక దాడులు చేస్తున్నారని విమర్శించారు. దాడులకు పాల్పడిన దుండగులపై ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోనీ, వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని. ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కేవీపీఎస్ కోరింది.