దివ్యాంగులకు ఫిజియోథెరపీ పరీక్షలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని భవిత పాఠశాలలో మంగళవారం దివ్యాంగులకు ఫిజియోథెరపీ చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన  విద్యార్థులకు  ఫిజియోథెరపీ చికిత్సలు చేసి‌ ఫిజియోథెరపిస్టు నవీన్ సాయి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పి. ఈ. టి .హనుమంత్ రెడ్డి, ఐఈఆర్పి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.