మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

– సర్పంచ్ లక్ష్మీ రామచంద్రయ్య శర్మ
నవతెలంగాణ పెద్దవంగర: మొక్కలు నాటి సంరక్షించడం మనందరి బాధ్యత అని పెద్దవంగర సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రం నుండి అధురు తండాకు వెళ్లే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల విపత్తులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని చెప్పారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆవాస ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, వార్డు సభ్యులు చెరుకు యాకయ్య, ఏదునూరి సమ్మయ్య, యూత్ నాయకులు చిలుక సిద్దు, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.