సోయా పంట పైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలీ..

– ఏడిఏ బిచ్కుంద నూతన్ కూమార్..

నవతెలంగాణ – జుక్కల్
సోయా పంట పైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని బిచ్కుంద ఏడిఏ నూతన్ కూమార్ సోమవారం నాడు అన్నారు. మండలంలోని చమడేగాం గ్రామములో హంగర్గ క్లస్టర్ ఏఈవో విశాల్ గౌడ్ తో కలిసి సోయా రైతులకు పంటల పైన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్య రక్షణ చర్యలు పాటీంచాలని ఏడిఏ రైతులకు వివరించారు. అదేవిధంగా ఇతర పంటలైన పత్తి, పెసర, మినుము, కందులు పంటలను కూడా నిత్యం పరీశీలించాలని , చీడపురుగుల పెర్గే ఆవకాశం ఉందని, రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడాలని, మందులను వ్వవసాయ అధికారుుల సూచనల మేరకు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో రైతులు వెంకట్ రావ్ పటేల్,   ఖండేరావ్, శివకాంత్, కపిల్, సోపాన్, కలీమ్ తదితరులు పాల్గోన్నారు.