
మండలంలోని బషీరాబాద్ గ్రామ శివారులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద 75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా 75 మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ సక్కారం అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ఆవరణలో 75 మొక్కలు నాటారు. అనంతరం మేరీ దేశ్ మేరీ మట్టిలో భాగంగా గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రతి ఇంటిపై దేశం మీద ఉన్న భక్తితో జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ కస్తూరి విక్రమ్, బిఆర్ఎస్ నాయకులు ఆర్.పి రాజు, సక్కారం నారాయణ, అంగన్వాడీ టీచర్లు మంజుల, అరుణ, సువర్ణ, పద్మ, ప్రణవ, ఆశ కార్యకర్తలు, వన సేవకులు, తదితరులు పాల్గొన్నారు.