నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని వీరజవాన్‌లకు గుర్తుగా మొక్కలను నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి సుమారు ఐదు మొక్కల చొప్పున నాటాలని సూచించారు. మొక్కల పెంపకంతో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రాణవాయువు లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మణ్, జోనల్ ఛైర్మన్ దొమ్మాట జగన్‌రెడ్డి, కోశాధికారి తిప్పారపు నాగరాజు, ఎంజీఎఫ్ సీనియర్ సభ్యులు డాక్టర్ తిరుపతిరెడ్డి, లయన్స్‌క్లబ్ సీనియర్ సభ్యులు పేర్యాల సుధాకర్‌రావు, నీల రవీందర్, గంగం సంతోష్‌రెడ్డి, ఖమ్మం వెంకటేశం, మ్యాకల సురేందర్‌రెడ్డి, జాలిగాం రాజు, గ్రామస్థులు రేవోజు కనకయ్య, వేల్పుల రాజయ్య, పొన్నాల లింగయ్య, తదితరులు పాల్గోన్నారు.