మొక్కలు లేని చోట మొక్కలను నాటిస్తం..

– సర్పంచ్ సతీష్ రావు, కార్యదర్శి కిషన్ రావు..
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాహదరుల వేంట ఇరువైపులా మొక్కలు లేని చోట మొక్కలను పాటిస్తామని సర్పంచ్ కులాచరి సతీష్ రావు, గ్రేడ్ వన్ కార్యదర్శి కిషన్ రావులు అన్నారు.బుదవారం డిచ్ పల్లి రైల్వేస్టేషన్ ప్లాంటేషన్  రైల్వే ట్రాక్ సమీపంలో సమీప కాలనీ వాసులతో కలిసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలే కిలకమని ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాల వద్ద, రాహదరులపై మొక్కలను నాటి దానిని సంరక్షించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఎవరికైన మొక్కలు అవసరం ఉంటే గ్రామ పంచాయతీ లో సంప్రదించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేందర్, రాజు, డిచ్‌పల్లి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.