– ఇంటింటా పంపిణీ..
నవతెలంగాణ- డిచ్ పల్లి
మానవ మనుగడకు మొక్కలే కిలకమని నడిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కులచారి సతీష్ రావు, గ్రేడ్ వన్ కార్యదర్శి కిషన్ రావు అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ పరిధిలోని నారపల్లి గ్రామంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వారి పేర్కొన్నారు ప్రజలు కూడా వివాహ గృహాలతో పాటు పంటపొలాల వద్ద కూడా మొక్కలు నాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ,నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.