పోచారం సవిత కు గ్లోబల్ ఫేమ్ అవార్డు పట్ల హర్షం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల అంబం గ్రామానికి చెందిన ఫోక్ సింగర్ సవిత పోచారం అనే కళాకారిణికి గ్లోబల్ ఫెమ్ అవార్డు రావడం పట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.ఎక్కడో మారుమూళ్ళ గ్రామం నుంచి తన టాలెంట్ ని ప్రదర్శించుకుంటూ తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రజానాట్య మండలి కళాకారిణిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అతి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపుని అందుకొని, సవిత పోచారం గారిని ఫోక్ సింగర్ గా గుర్తించి మహమ్మద్ ఆర్ట్స్ గ్లోబల్ ఫెమ్ అవార్డ్ నీ అందించారు, యాంకర్ పప్పు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ సిని పరిశ్రమకి చెందిన నటి, నటులు, వైద్యులు, బలగం సినిమా సీరియల్ సినిమా యాక్టర్స్ చేతుల మీదుగా ఈ అవార్డ్ లని ప్రధానం చేసారు గౌరవ మర్యాదలతో శాలువాలతో సన్మానించి మెమొంటో తో అవార్డుని ప్రధానం చేసారు, ఈ కార్యక్రమం ఒక్క ముఖ్య ఉదేశ్యం మారు ముళ్ల గ్రామాల్లో టాలెంట్ వుండి బయటకి రాలేని వారిని వెలితిలోకి తియ్యడమే మహ్మద్ అట్స్ పప్పు లక్ష్యం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యాంకర్ మహమ్మద్ పప్పు ని అభినందిస్తూ ఇంకెన్నో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనీ ఫోక్ సింగర్ సవిత పోచారం అభినందించారు. ఎడపల్లి మండలం, అంబం గ్రామం నుంచి ఒక కళాకారిణిగా ఇంత గొప్ప పేరు ప్రాఖ్యతలని సంపాదించుకున్నందుకు ప్రజానాట్యమండలి కళాకారుని పోచారం సవితకు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, మల్యాల గోవర్ధన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు అభినందించారు. మరింత అభివృద్ధి చెంది ప్రజల పక్షాన ప్రజలను చైతన్య పరిచే విధంగా గీతాలను ఆలపించాలని అన్నారు.