– అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన పోచారం
– అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న దృశ్యం
నవతెలంగాణ – కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి వరకు సుమారు 30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఉదయం నూతనంగా నిర్వహించబడుతున్న అయ్యప్ప, సాయిబాబా ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి, అనంతరం గ్రామ పొలిమేరల నుండి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు అభివృద్ధి పనులకు ముదిరాజ్ , రజక, మున్నూరు కాపు సంఘ, తదితర అభివృద్ధి పనులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి సహాయముతో 11 వేలు రెండు పడకగదుల నిర్మాణం చేపట్టామని , అన్ని రంగాలలో బాన్సువాడని అభివృద్ధి చేశామన్నారు ఏడు కోట్ల రూపాయలతో మైనార్టీ కళాశాలను శనివారం హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు నా బలం, బలగం బాన్సువాడ నియోజకవర్గ ప్రజలని , వారి ఆశీర్వాదం తోనే నేను ఈరోజు నిర్భయంగా తిరగ గలుగుతున్నానని, ముఖ్యమంత్రి మరొకసారి శాసనసభ్యులుగా నిలబడడానికి అవకాశం ఇచ్చారని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నా ప్రజలే నాకు రక్ష నా జీవితం ప్రజలకు అంకితం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత శ్రీనివాసరావు జెడ్పిటిసి శంకర్ పటేల్, గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, అధ్యక్షులు కూచి సిద్దు, ఆర్డీవో రాజా గౌడ్, ఏఎంసీ అబ్దుల్ వహీద్, మండల రైతు కన్వీనర్ కొల్లూరు కిషోర్ బాబు, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు