నవతెలంగాణ ఆర్మూర్: నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి సతీమణి అన్యోన్య రెడ్డి మంగళవారం పట్టణంలో నామినేషన్ దాఖలు చేసినారు.. రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తుందని, బీ.ఆర్.ఎస్ పాలనలో పైనుండి కిందిస్థాయి వరకు నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలకు అమ్ముకున్నారని ఆరోపించారు.. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రజలదే అని, నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.