బిందువు..

మన బంధువు

ఒకప్పుడు..
పుడమిని గిల్లితే
పాతాళ గంగమ్మ పరవళ్లు.
మరిప్పుడో…
ఎంత తవ్వినా
కానరాదు గంగమ్మ.
ఎందుకీ దుస్థితి?
అవగాహనా లోపమో,
భవితపై బాధ్యతారాహిత్యమో,
ఎటుచూసినా నీటి వృధా.
పట్టదా అనావృష్టి వ్యధ?
ఒక్క బిందువు సృష్టించలేవు
వృధా చేసే హక్కేది నీకు?
ప్రకృతి ప్రసాదాన్ని
ఒడుపుగా పొదుపుగా వాడు.
చుక్క చుక్కను
ఒడిసిపట్టే దారి చూడు.
ఇంటింటా ఇంకుడుగుంతలు
పాతాళగంగమ్మకు
ఝటాజూటాలు.
చేయీ చేయీ కలుపు,
పలుగు పారా చేతపట్టు,
నింగి జలసంపదను
నేలలోకి ఇంకింపచేయి,
నీటి కొరతకు చరమ గీతం పాడు.
గుర్తెరిగి మసలు..
చినుకు క్షేమమైతేనే
మనం క్షేమమని,
లేకుంటే క్షామమేనని.
– వేమూరి శ్రీనివాస్‌, 9912128967