పోలవరం బాధితులకు పునరావాసం కల్పించాలి

ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
న్యూఢిల్లీ: పోలవరం ముంపు బాధితులకు పరి హారం, పునరావాసం కల్పించాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శని వారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అర్ధాన్నే మార్చేస్తుంది. నిర్మాణ వ్యయం ఇస్తాం. కాని పునరా వాసం కల్పించలేమని అంటున్న కేంద్రం కేసుల కోసం జగన్‌ కేంద్రానికి సరెండర్‌ అయ్యి పోలవరాన్నీ కేంద్రానికి తాకట్టు పెట్టారు. గత కొన్నేండ్లుగా పోలవరానికి నిధులు ఇవ్వడం లేదు. లక్ష మంది ప్రజలకు రూ.34 వేల కోట్ల పునరావాస ప్యాకేజి ఇవ్వాల్సి ఉంది. ముంపునకు గురయ్యే షెడ్యూల్‌ ప్రాంతంలో 18 ఏండ్లుగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి. కానీ నిర్వాసిత కుటుంబానికే ఇస్తామంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ముంపు బాధితులకు పునరావాస నిధులు ఇవ్వకపోవడాన్ని ఖండి స్తున్నాం’ అన్నారు.
‘అభివృద్ధి పేరుతో తెలంగాణాలోని హైదరాబాద్‌లో పేదల నుంచి అన్యాయంగా భూములు లాగేసుకుంటున్నారు. భూ రక్షణ ఉద్య మాలు దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అసైన్డ్‌ భూములు తీసుకోవడం వల్ల దళితులు, పేదలకు నష్టం జరుగుతుంది’ అని అన్నారు.