కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్లను ఆరెస్ట్ చేసిన పోలీసులు

నవతెలంగాణ – మంథని
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలులో నిర్లక్ష్యం, తరుగు పేరుట దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ ని కలవడానికి విచ్చేసిన కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండ రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన కిసాన్ సెల్ జిల్లా చైర్మన్లను,నాయకులు సివిల్ సప్లై భవాని ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని అధికారులు వివిధ రకాల కొరివి పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటే, మరోపక్క మిల్లర్లు రైతులను తరుగు పేరిట మోసం చేస్తున్నారని సివిల్ సప్లై భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ లను, నాయకులను అరెస్టు చేసి పోలీస్ వాహనాలలో బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ సివిల్ సప్లై భవన్ ముందు నిరసన కార్యక్రమానికి మంథని నుండి తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కల. సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి ప్రసాద్, మబ్బు తిరుపతి, ఆరెల్లి కిరణ్ గౌడ్, మోహన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.