పడిగెల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ

నవతెలంగాణ- ఆర్మూర్: మండలంలోని పడిగల్ x రోడ్డు వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా జగిత్యాల కి చెందిన నీలగిరి అనీల్ రావు అనే వ్యక్తి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద ఒక లక్ష రూపాయలు ఉండగా వాటికి ఎలాంటి ధ్రువ పత్రాలు చూపించక పోవడం తో ఆ లక్ష రూపాయల ను పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. అని ఎస్సై వినయ్ కుమార్ సోమవారం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున ప్రయాణాల్లో ఎవరు కూడా 50 వేల కంటే ఎక్కువ గా డబ్బులు ఉంచుకోరాదు అని తెలిపారు.