నవతెలంగాణ-మహాదేవపూర్
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు మంగళవారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన కూడళ్ల గుండా పోలీసు ధికారులు, సిబ్బంది, సాయుధ పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై భరోసా కల్పించడం లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిం చామని పోలింగ్ రోజున ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ల మనస్సులలో విశ్వాసాన్ని కలిగించడానికి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్, మహాదేవపూర్ ఎస్సై లు రాజ్ కుమార్ భవాని సేన్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.