కుట్టు మిషన్లను పట్టుకున్న పోలీసులు

Police holding sewing machines– బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సంబంధించినవిగా ప్రచారం
నవతెలంగాణ-నడికూడ

ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న కుట్టు మిషన్లను పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా నడికూడ మండల చెక్‌ పోస్ట్‌ వద్ద గురువారం ఉదయం డీసీఎం వ్యానును పోలీసులు తనిఖీ చేయడంతో అందులో 500 కుట్టు మిషన్లు ఉన్నాయి. వాటిని వరికోల్‌ తరలిస్తున్నట్టు డ్రైవర్‌ తెలిపారు. ఆ వాహనాన్ని పరకాల ఆర్‌డీవో కార్యాలయానికి తరలించారు. అవి పరకాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి సంబంధించినవిగా తెలిసింది. అలాగే వరికోల్‌ గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్న ఫంక్షన్‌ హాల్‌లో వందలాది కుట్టు మిషన్లను మహిళలకు పంచేందుకు సిద్ధంగా ఉంచారు.