నిష్పాక్షపాతకంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్‌ అధికారులు పనిచేయాలి

– ఎన్నికలకు ములుగు పోలీస్‌శాఖ సంసిద్ధం: ఎస్పీ గౌష్‌ఆలం
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో స్వేచ్ఛ, నిష్పాక్షపాతకంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్‌ అధికారులు పనిచేయాలనీ, ఎన్నికలకు ములుగు పోలీస్‌ శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ శాఖ కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్‌శాఖ సంసిద్ధమైందని, జిల్లాలోని సిబ్బందికితోడు స్పెషల్‌ ఫోర్స్‌తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఎన్నికల వేళ డబ్బు, మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌ వంటివి తరలించే ముఠాలపై పోలీసులు నిఘా పెట్టామని, ఇంట ిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే అన్ని మండలాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. రానున్న తెలంగాణ శాసన సభ ఎలక్షన్స్‌ నేపథ్యంలో సిబ్బందికి ఎలక్షన్‌ కమిషన్‌ అఫ్‌ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా పలు అంశాలను జిల్లా అధికారులకు మార్గదర్శకాలను ఎస్పి సూచించారు.మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ మార్గదర్శకాలు, దాని అమలు తీరు,అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌ పోస్ట్‌లలో కఠినమైన తనిఖీలను నిర్వహించడం, ఎన్నికల నేరాల చట్టంలోని సెక్షన్‌లకు సంబంధించి స్పష్టత, వీఐపీ భద్రతా అంశాలు అవాలం భించవలసిన పద్ధతులను సూచించారు.ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నందున ఏట్టిపరిస్థులలో రాజకీయనాయకులకు సెల్యూట్‌ వంటివి చేయరాదాని ఈసిఐ విధి విధానాలను మాత్రమే పాటించాలని సూచించారు.ములుగు జిల్లా మావోయిస్ట్స్‌ ప్రాబల్యం ఉన్నందున ఎన్నికల దష్ట్యా ఎల్డబ్ల్యూఇ ముప్పును ఎదుర్కోవడం వంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని, జిల్లా ఇంటలిజెన్స్‌ టీం తో పాటు రాష్ట్ర ఇంటలిజెన్స్‌ కూడా క్రియాశీలకంగా పనిచేస్తుందని తెలిపారు.అక్రమ మద్యం డెన్లపై దాడులు నిర్వహించాలని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పి సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఎస్పి ఏటూరు నాగారం సిరిశెట్టి సంకీర్త్‌, డిఎస్పి డిసిఆర్బి సుభాష్‌ బాబు, ఎస్డిపిఓ ములుగు రవీందర్‌, సిఐ స్పెషల్‌ బ్రాంచ్‌ కిరణ్‌, సిఐ సిసిఎస్‌ దయాకర్‌,సిఐ ములుగు రంజిత్‌ కుమార్‌, సిఐ పస్రా శంకర్‌, సిఐ ఏటూరునాగారం రాజు, సిఐ వెంక టాపురం కుమార్‌, ఎస్‌ఐ ములుగు, వెంకటాపూర్‌, పస్రా, ఏటూరునాగారం, మంగపేట, వెంకటేశ్వర్లు, చల్ల రాజు, షైక్‌ మస్తాన్‌, కష్ణ ప్రసాద్‌, రవి కుమార్‌, ఎస్‌ఐ తాజుద్దీన్‌ పాల్గొన్నారు.