గ్రామాల్లో పోలీస్ కవాతు..

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు స్వచ్ఛత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు పోలీస్ కవాతు నిర్వహించారు. మండల కేంద్రమైన కమ్మర్ పల్లి తో పాటు ఉప్లూర్ గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన భద్రత చర్యలు చేపట్టినట్లు ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు స్థానిక పోలీసులతో కలిసి కేంద్ర బలగాలైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కమ్మర్ పల్లి, ఉప్లూర్ గ్రామాల్లో కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలో హాస  కొత్తూర్  బైపాస్ ఎక్స్ రోడ్ నుండి  గ్రామ వీధుల విధులు పోలీస్ కవాతు కొనసాగింది. ఉప్లూర్ గ్రామంలో బస్టాండ్ నుండి  గ్రామ వీధుల గుండా ఎర్గట్ల రోడ్డు వరకు ఈ కవాతు కొనసాగింది. ఈ కవాతులో రాపిడి యాక్షన్ ఫోర్స్  సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు  ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి ఎస్ఐ పి. రాజశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్  నద్వాల్, ఇన్స్పెక్టర్లు రాబిన్ బాబు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.