నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ రాతపరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ సి శ్రీనాథ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్ రాతపరీక్షను ఈనెల 17న నిర్వహించిన విషయం తెలిసిందే. పాలిసెట్‌కు 1,05,656 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 98,273 (92.94 శాతం) మంది హాజరయ్యారు.