గ్రూప్-1 అభ్యర్థులను అక్కున చేర్చుకుంటాం
బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
నవతెలంగాణ-ముషీరాబాద్
పేద వర్గాలపై దయలేని రాజకీయ పార్టీలను పాతరేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి యువ నాయకులు గాజు యుగేందర్ యాదవ్ నేతృ త్వంలో బాగ్‌లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న తపనతో గ్రూప్- 1కు ప్రిపేరైన విద్యార్థుల భవిష్యత్ లీకేజీతో అంధ కారంలో మునిగిపోయిందన్నారు. ఈ ప్రస్తుత పరిసితిని అధిగమించడానికి మళ్లీ నిర్వహించే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ముగింపు వరకు తమ సామాజిక భాద్యతగా అభ్యర్థులకు రెండు పూటలా భోజనం, స్టడీ మెటీరియల్, కెరీర్ గైడెన్స్, మెడికల్ కేర్, వివిధ సంస్థల సహకారంతో హాస్టల్ వసతిని సైతం అందించ నున్నట్టు తెలిపారు. గ్రూప్-1 లీకేజీపై ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటన్న ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. ఈ కష్ట కాలంలో ఏ విధంగా నిరుద్యోగులకు అండగా నిలువగలరో ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సబ్బండ వర్గాల కు సమాన ప్రాతినిధ్యం లేని ప్రస్తుత రాజకీయ వ్యవ స్థను ప్రక్షాళన చేసే సమయం ప్రజలకు ఆసన్నమైందన్నారు. బీసీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, న్యాయ వాదులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు బలంగా ఎదిగినప్పుడే బీసీ నాయకులు సైతం బలపడే అవ కాశం ఉంటుందన్నారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ కష్టకాలంలో విద్యార్థుల భవి ష్యత్తుతో దోబూచులాడటం ప్రభూత్వానికి సరికాదన్నా రు. ప్రతిపక్షాలు సైతం వందల వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ ఫండ్‌గా మార్చుకుంటుందే గానీ ప్రజలకు కష్టం సంభవిస్తే కనీసం కనికరించకుండా వ్యవహరించడం చూస్తే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలపై పాలకవర్గాల కు ఉన్న సామాజిక బాధ్యత స్పష్టంగా తెలుస్తుందన్నా రు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రూప్ వన్ అభ్యర్థుల నిత్య భోజన కార్యక్రమానిన్ని బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నాయకులు బత్తుల శంకర్, మహిళా నాయకురాలు బోనం ఊర్మిళ, భరత భాగ్యలక్ష్మి, దాసు బలరాం, మంద వెంకటస్వామి, సలీం పాషా, దాసు నరేష్. తదితరులు పాల్గొన్నారు.