నవతెలంగాణ-దుగ్గొండి
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్‌గా దుగ్గొండి మండలానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పొన్నం మొగిలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పొన్నం మొగిలి అనే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీని కేసీఆర్ ప్రభుత్వం, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని ఉద్వేగ భరితంగా ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే నర్సంపేట మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ దుగ్గొండి మండలానికి పరిమితమైన నన్ను ఎమ్మెల్యే వరంగల్ జిల్లాలోని రెండవ అతిపెద్ద మార్కెట్ అయినా నర్సంపేట మార్కెట్ చైర్మన్ గా ఎంపిక చేయడంతో బాధ్యత పెరిగిందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచిన నాతో పాటు కమిటీ సభ్యులకు అరుదైన గౌరవాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. రైతులకు అండదండగా ఉంటూ వ్యవసాయ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అలాగే బీఆర్‌ఎస్ పార్టీ పట్ల తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడిఏ శ్రీనివాస్ రావు, వ్యవసాయ మార్కెట్ ఉన్నతాధికారి ప్రసాద్ రావు, కాట్ల కోమల భద్రయ్య, సొసైటీ చైర్మన్ లు సుక్కినే రాజేశ్వర్ రావు, ఊరటి మైపాల్ రెడ్డి, పైడి,శంకేశు కమలాకర్, వెంకటేశ్వర్లు, పిండి కుమారస్వామి, మెరుగు రాంబాబు, ముదురుకోల శారద కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.