అసమ్మతి వాయిదా

నవతెలంగాణ – మాక్లూర్
గత కొన్ని రోజులుగా మాక్లూర్ మండలంలో అసమ్మతి ల పై చర్చలు జరుగుతున్నాయి. ఉన్నత అధికారుల నుంచి ఈ నెల 17వ తేదీన ప్రాథమిక సహకార సంఘం ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మండల అధ్యక్షులు(ఎంపీపీ) ప్రభాకర్ పై ఎంపీటీసీలు వెంకటేశ్వర్ రావు, గోవురి ఒడ్డెన్న అసమ్మతి ప్రకటించారు. ఎంపీపీపై ఎన్నికలను అధికారులకు శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా, ఎంపీపీ ప్రభాకర్ కోర్టు నుంచి స్టే తీసుక రావడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మండలంలో అటు సొసైటీ చైర్మన్, ఇటు ఎంపిపి ఎన్నికలపై అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఎంపీపీ, చైర్మన్ ఎవరు అవుతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.