– కూరగాయలను పారేసి రైతుల నిరసన 284 సర్వే నెంబర్ సమస్య పరిష్కారమయ్యే సంబరాలు వద్దు
– రైతులకు ఒక న్యాయం.. నాయకులకు ఒక న్యాయమా? దశాబ్ది ఉత్సవాలు జరిగితే ఆత్మహత్యలకైనా సిద్ధమే
– మహమ్మద్ నగర్ రైతు వేదిక వద్ద రైతుల ఆందోళన
నవతెలంగాణ కౌడిపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు దినోత్సవ వేడుకలు శనివారం ప్రారంభం కాగానే కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో అధికారులకు ఛేదు అనుభవం ఎదురైంది. మూడు తరాల నుండి 284 సర్వే నెంబర్‌లో సాగు చేస్తున్న భూమి ధరణి పోస్టల్‌లో వేరే వారి పేరుపై నమోదు కావడంతో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. 284 సర్వే నెంబర్ లో 1100 ఎకరాల భూమి ఉంది. అడవి భూమి 220, అసైన్మెంట్ 700, పట్టా 75 ఎకరాలు ఉంది. 75 ఎకరాల్లో దాదాపు 60 మందికి పైగా రైతులు గత కొన్ని తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఫాతిమా బేగం 1961లో వేరే వ్యక్తులకు అమ్మేసి పోయింది. ప్రస్తుతం మళ్లీ ధరణిలో రెవెన్యూ అధికారుల చేతివాటంతో తరాల నుండి పండిస్తున్న రైతుల భూములు భూమి నాదే అంటూ కబ్జాదారులతో అధికారులు చేతులు కలుపుతున్నారం టూ రైతులు ఆందోళన దిగారు. అనంతరం టిఆర్ ఎస్ పార్టీ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు నిర్వహిం చవద్దని వంద మంది రైతులు కుటుంబ సభ్యులతో వచ్చి వేసిన టెంట్లను కూలగొడుతూ, వంట చేసే పొయ్యిలో ట్యాంకర్ నీళ్లతో ఆర్పేశారు. కూరగాయల ను తీసేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ దష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చేయకుండా బడా నాయకులకు పొజిషన్ చూపించటం ఏంటంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ శివప్రసాద్ రెడ్డి, సీఐ షేక్ లాల్ మదర్, తహసీల్దార్ కమలాద్రి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిం చడానికి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. సమస్య తీరే వరకు ఊరుకునేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో సర్పంచ్ మాట్లాడారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కషి చేయాలని వివరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించకపోతే సర్పంచ్, వార్డ్ మెంబర్లు కలిసికట్టుగా రాజీనామా చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం దశాబ్ది ఉత్స వాలు కార్యక్రమం నిర్వహించాఉ. కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, సర్పంచ్ దివ్య మైపాల్ రెడ్డి, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రామారావు, గ్రామాల సర్పంచులు ఉన్నారు.