ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విద్యుత్‌కు అంతరాయం

– నిలిచిపోయిన బోర్డింగ్‌, చెక్‌ఇన్‌లు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం దాదాపు అరగంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బోర్డింగ్‌, చెక్‌ఇన్‌ సౌకర్యాలపై ఇబ్బంది ఏర్పడింది. టెర్నినల్‌ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది. దీంతో వందలాది ప్రయాణికులు క్యూలలో నిలిచిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు. అయితే ఢిల్లీలో నీటి సమస్యతో పాటు విద్యుత్‌ సమస్య కూడా మొదలైందని సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి.