నూతన ఏఎంసీ చైర్మన్ ను సన్మానించిన పిపి

నవతెలంగాణ- భిక్కనూర్
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ పురం రాజమౌళి, డైరెక్టర్ రాకేష్ రెడ్డిలు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా కోర్టు ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్ శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. రైతులకు సేవలు చేస్తూ, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, వాసవి క్లబ్ మండల అధ్యక్షులు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.