
త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ నుండి పి ఆర్ సి ఐ ఆర్ లను ఇప్పించేందుకు కృషి చేస్తామని పిఆర్టియు మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరుణాపురం గ్రామంలోపిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పిఎస్ కరుణాపురం, పిఎస్ రెడ్డిపల్లి పిఎస్ పెద్ద పెండ్యాల,యుపిఎస్ ఎలుకుర్తి , పిఎస్ కేశవ నగర్ పిఎస్ కాశ గూడెం పిఎస్ జానకిపురం పి ఏ సి క్యాతంపల్లి ,జెడ్పిహెచ్ఎస్ మరియు పిఎస్ నారాయణగిరి పాఠశాలలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో పిఆర్సి ఏర్పాటు , గౌరవప్రదమైన ఐఆర్ ఇప్పించడం జరుగుతున్నది. కోర్టుకేసు తో సంబంధం లేకుండా ప్రమోషన్లు నిర్వహించబడతాయని, ఆగస్టు మాసంతానికి పెండింగ్ బిల్లులు పూర్తిచేయబడతాయని, ధర్మసాగర్ మండలం లో ఇంటి అద్దె పంపు పెంపు జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జాన్ సింగ్, రాష్ట్ర బాధ్యులు బండ రమేష్ కేశవరెడ్డి జిల్లా బాధ్యులు నరేష్ సూర్య ప్రకాష్ శ్యామ్ సుందర్ రెడ్డి కుమారస్వామి మరియు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని విజయవంతం చేసినారు