జంధ్యాల తెలుగు తెరకు అందించిన రత్నాలు ప్రదీప్ పూర్ణిమ

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రఖ్యాత దర్శకుడు తెలుగు తెరకు అందించిన రత్నాలు ప్రదీప్ పూర్ణిమ లని వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై శారద మ్యూజిక్ అకాడమీ నిర్వ్యహణ లో తెలుగు హిందీ సినీ గీతాల విభావరి జరిగింది. గాయని శారద సహాగాయకులు మోహన్,పవన్ కుమార్, భరద్వాజ్,నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి తో కలసి మధురం గా గానం చేశారు. రేణుక,లక్ష్మీ పద్మజ, రమా దేవి తదితరులు కూడా పాల్గొని పాటలు అలపించారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో వంశీ రామ రాజు పాల్గొని నటుడు ప్రదీప్ ను నటి పూర్ణిమ ను శారద, తదితర అతిధుల తో సత్కరించి మాట్లాడారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమా లో జంటగా పరిచయం ఐన ప్రదీప్ పూర్ణిమ లు సాత్విక నటన తో అసభ్యత లేకుండా ప్రేమ సన్నివేశాలు పండించి ప్రేక్షక హృదయాలు లో నేటికి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని వివ రించారు. వీరిని సత్కరించటం గత కాలపు మంచిని గుర్తు చేసుకోవటం అన్నారు. పూర్ణిమ గాయకులతో కలసి శ్రావ్యం గా పాడి మాట్లాడుతూ పాత పాటలు పాడటం తనకు ఇష్టమని, అవకాశం కల్పించిన శారద కు ధన్య వాదాలు తెలిపారు. ప్రదీప్ మాట్లాడుతూ గాన సభ లోశక్తి ఉందని ఈ వేదిక పై నాటకం వేస్తున్నప్పుడు చూసి జంధ్యాల తనను సినిమా హీరో చేశారని తెలిపారు పోషకులు వేణు గోపాల్, సుందరి, కోటేశ్వరరావు, నాగేస్వరి, రామకృష్ణ తనికెళ్ళ,ప్రతాప్ కుమార్, జగదేశ్ తదితరులు పాల్గొన్నారు.